దిశ హత్య ఫై చంద్రబాబు ఆవేదన..

దిశ హత్య ఫై చంద్రబాబు ఆవేదన..



నాల్గు రోజుల క్రితం దిశ ను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన చేసిన నేరస్థులకు కఠిన శిక్షలు విధించాలని..తెలంగాణ ప్రభుత్వం సైతం ఆడవారి భద్రత ఫై శ్రద్ద తీసుకోవాలని అంటున్నారు. కాగా ఈ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు.


చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వెళ్తూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 44వ నెంబర్ జాతీయ బైపాస్ రహదారిపై చంద్రబాబు కాసేపు కాన్వాయిని రోడ్డుపై దిశ ఘటన పట్ల స్పందించారు. శంషాబాద్ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో జరుగుతున్న లోటుపాట్లను గ్రహించి దోషులను త్వరగా శిక్ష పడే విధంగా చూడాలన్నారు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. దోషులను కఠినంగా శిక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు.