ఇండియాలోనే గ‌డ‌పండి, ఇండియా వ‌స్తువుల‌నే కొనండి: కాజ‌ల్

కరోనా కార‌ణంగా భార‌త ప్ర‌ధాని 21 రోజుల పాటు లాక్‌డౌన్  ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న అనేక రంగాల‌కి చెందిన ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. రోజువారి వేత‌నం పొందే కార్మికుల‌తో పాటు వాటిని న‌డుపుతున్న సంస్థ‌లు కూడా న‌ష్టాల‌లో ఉన్నాయి. ఈ ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న కాజల్ అగ‌ర్వాల్ దేశ ప్ర‌జ‌ల‌కి త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప‌లు సూచ‌న‌లు చేసింది.


కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత స్థానిక వ్యాపారులకు, వ్యాపార సంస్థలకు ప్రజలంతా మద్దతు తెలపాలని కోరింది కాజ‌ల్‌. లాక్‌డౌన్ పూర్తైన త‌ర్వాత మన దేశానికి మంచి చేయాల్సిన బాధ్యత మనపైనే ఉంది.  మీ సెలవులన్ని ఇండియాలోనే గడపండి బయట తినేవాళ్లు స్థానిక రెస్టారెంట్ హోటల్స్ లో తినండి. ఇండియాలో పండించిన కూరగాయల్ని, పండ్లను కొనండి. ఇండియన్ బ్రాండ్ల షూస్‌, క్లోత్స్ కొని భారత్ వ్యాపారులకు సహాయం చేయండని తెలిపింది. కరోనా వ‌ల‌న బాగా దెబ్బ తిన్న భారత ఆర్థిక వ్యవస్థ మన సాయం లేకుండా కోలుకోవడం చాలా క‌ష్టం. క‌రోనా త‌ర్వాత కూడా మ‌నం ఒక‌రికొక‌రం సాయంగా ఉంటూ ముందుకు సాగుదాం అని చెప్పుకొచ్చింది ఈ క‌లువ క‌ళ్ల సుందరి